Header Banner

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.. మంచు కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితి.. గేటు బయటే కింద కూర్చున్న మనోజ్!

  Wed Apr 09, 2025 12:22        Entertainment

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న విభేదాలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఒక వర్గంగా... రెండో కుమారుడు మంచు మనోజ్ మరో వర్గంగా విడిపోయారు. మంచు కుటుంబ రచ్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మరోసారి మంచు కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ తన కుటుంబంతో సహా అక్కడకు వెళ్లారు. అయితే, మనోజ్ లోపలకు వెళ్లకుండా గేటు మూసేశారు. ఇంట్లోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

దీంతో, గేటు బయటే రోడ్డుపై మనోజ్ బైఠాయించారు. మనోజ్ అక్కడకు వస్తున్నాడనే సమాచారంతో అప్పటికే అక్కడ పోలీసులు మోహరించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భద్రతను ఏర్పాటు చేశారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా భార్యాపిల్లలతో రాజస్థాన్ కు ఈ నెల 1న వెళ్లానని... అప్పుడు తన సోదరుడు విష్ణు 150 మందితో జల్ పల్లిలోని తన ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశాడని... తన కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశాడని పోలీసులకు నిన్న మనోజ్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఈరోజు మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లాడు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ManchuVishnu #Tollywood #MAA